Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పారునంది భాస్కర్ జన్మదిన వేడుకలు

ఘనంగా పారునంది భాస్కర్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలోని కేసీఆర్ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పారునంది భాస్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పారునంది భాస్కర్‌ను శాలువాలతో సన్మానించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పారునంది భాస్కర్ మాట్లాడుతూతనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

కొల్లూరు గ్రామాన్ని అన్ని విధాలా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పిల్లలమర్రి శంకరయ్య,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివరాత్రి లక్ష్మయ్య,కొల్లూరు గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాజుల దశరథ యాదవ్, మాటూరు మాజీ ఎంపీటీసీ అంబాల శ్రీనివాస్ గౌడ్, బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుషిగంపల అంజయ్య,ఎండి మస్తాన్,మాజీ వార్డ్ సభ్యులు కొంతం సిద్ధార్థ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గాజుల వెంకటేష్ యాదవ్, కాన్రాజు, నరేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు గ్యాదపాక మల్లేష్, ముద్దేపాక గణేష్, మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్.డి.జి.ఎల్, అర్జున సంఘం అధ్యక్షుడు జి. సుధాకర్, మాజీ వార్డు సభ్యులు యాదగిరి, కొల్లూరు ట్రాక్టర్ అసోసియేషన్ సంఘం అధ్యక్షుడు గ్యాదపాక సురేష్, కొల్లూరు డప్పు కళాకారులు రాజు, కిష్టయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -