నవతెలంగాణ – కామారెడ్డి
మార్చ్ – 2026లో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా ఐ డి ఓ సి, కలెక్టరేట్, కామారెడ్డిలో సి ఎస్, డివో లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ డిప్యూటీ సెక్రటరీ పద్మ, పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి అధికారులు మాట్లాడుతూ, సి ఎస్ లు, డివో లు, కస్టోడియన్లు విధి విధానాలను ఖచ్చితంగా అనుసరించి పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పరీక్షల సమయంలో అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో మొదటి సంవత్సరం 9,013 మంది, రెండవ సంవత్సరం 8,940 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలపై సమీక్షా సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



