మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్
నవతెలంగాణ – ఆలేరు టౌను
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్య గౌడ్ అన్నారు. ఆలేరు పట్టణంలో గురువారం ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం దొంతిరి సోమిరెడ్డి గార్డెన్ లో నిర్వహించారు. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, అమలు చేయకుండానే ఎన్నికలు నిర్వహించాలని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికలలో డబ్బులు ఎక్కువ వెదజల్లి ,ప్రజలను మభ్య పెట్టారని చెప్పారు.కెసిఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలు ప్రజలు అద్భుతంగా పాలన జరిగిందని చెప్పారు. సబ్బండ వర్గాలకి సంక్షేమ పథకాల అందిస్తూ అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినటువంటి తెలంగాణను, మళ్ళీ దాదాపు 20 ఏళ్ళు ఎనకకు నెట్టుకుపోయే పరిస్థితి నెలకొంది అన్నారు. బీహార్ సంస్కృతిని తీసుకువచ్చి ప్రజలను నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
జడ్పిటిసి ఎన్నికలు పెడతామాని, అంతకు ముందే రైతుబంధు వేస్తామని చెప్తా ఉన్నారని, మరి రెండుసార్లు రైతుబంధు ఎటు పోయిందని ప్రశ్నించారు. రైతు ఆత్మహత్యలు జరిగితే ఎక్కడ కూడా ప్రభుత్వం స్పందించలేదన్నారు. కేసీఆర్ ని తిట్టేందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టుగా అనిపిస్తుందని ఎందుకంటే ప్రతి ఒక్క వేదిక మీద ఆయన మాట్లాడేటటువంటి మాట కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడుతాడు తప్ప, అభివృద్ధి సంక్షేమ పథకాల అంశాల గురించి మాట్లాడడని దుయ్యబట్టారు.
ఈ సమావేశంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ జెడ్పీటీసీ బోట్ల పరమేశ్వర్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మొగలగాని మల్లేశం, మున్సిపల్ కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీష్, యాట శివ, బీజాన కళ్యాణి మధు, నాయకులు కొలుపుల హరినాథ్, బేతి రాములు, మాదాని పిలీప్, ఆడెపు బాలస్వామి, జల్లి నరసింహులు,యాట విజయలక్ష్మి, సీస మహేశ్వరి, సుజాత,పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



