Sunday, June 21, 2026
E-PAPER
Homeబీజినెస్వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు..!

వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు..!

- Advertisement -


ఐసీఐసీఐ గ్లోబల్ మార్కెట్స్ ఎకనామిక్ రీసెర్చ్
న్యూఢిల్లీ :
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గత జూన్‌తో పోలిస్తే 16 శాతం మేర తగ్గడం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సద్దుమణగడం భారత ఆర్థిక రంగానికి సానుకూల సంకేతాలని ఐసిఐసిఐ గ్లోబల్ మార్కెట్స్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ తాజా నివేదికలో పేర్కొంది. గత ఆర్‌‌బిఐ ఎంపిసి సమావేశం నాటికి బ్యారెల్ ధర 95 డాలర్లుగా ఉండగా.. ప్రస్తుతం యుఎస్‌-ఇరాన్‌ శాంతి ఒప్పందాల వల్ల భారీగా తగ్గింది. కీలక ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉండటం, జిడిపి వృద్ధి రేటు 7.8 శాతంతో ఆశాజనకంగా నమోదు కావడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఆగస్టులో జరగబోయే మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ద్రవ్యోల్బణ అంచనాలను ఆర్‌బిఐ తగ్గించే అవకాశం ఉందని నివేదిక విశ్లేషించింది. చమురు ధరలు బ్యారెల్‌కు 80-85 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగితే.. వడ్డీ రేట్లను వెంటనే పెంచాల్సిన అవసరం తగ్గుతుందని అభిప్రాయపడింది. అయితే జూన్ నెల వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) గణాంకాలు, రుతుపవనాల గమనం, అంతర్జాతీయ ఒప్పందాల అమలుపైనే ఆర్‌బిఐ తుది నిర్ణయం ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -