Saturday, June 20, 2026
E-PAPER
Homeబీజినెస్ఆంధ్రప్రదేశ్‌తో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్న సెంచరీప్లై (Centuryply)

ఆంధ్రప్రదేశ్‌తో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్న సెంచరీప్లై (Centuryply)

- Advertisement -

• కడప జిల్లా బద్వేలులో మొదటి దశలో సెంచరీప్లై రూ.1,000 కోట్ల పెట్టుబడి

• 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బద్వేలు ప్లాంట్

నవతెలంగాణ విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలులో రూ.1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో తమ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సెంచరీప్లై (ఇండియా) లిమిటెడ్ రాష్ట్రంతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్న సంగతి తెలిసిందే. కోల్‌కతాలో ‘ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్'(ఐసిసి) నిర్వహించిన కార్యక్రమంలో ఈ సంస్థ అత్యంత కీలక భూమిక పోషించింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఐటీ,ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్గధామంగా నిలుస్తుందని భరోసా అందించారు. రాష్ట్రానికి సంబంధించిన మూడు ముఖ్యమైన అంశాలుగా వేగం, స్థిరత్వం, సేవలను మంత్రి పేర్కొన్నారు.

బెంగాల్ పెట్టుబడిదారులకు సాదర స్వాగతం పలికిన మంత్రి మాట్లాడుతూ భారతదేశం అత్యంత కీలకమైన మలుపు దశలో ఉంది. పాశ్చాత్య దేశాలు,తూర్పు దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఇక్కడ లభించే జనాభా పరమైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవాల్సిన సమయం ఇదని చెప్పిన ఆయన ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని తెలిపారు. భారతదేశంలో జరిగే ప్రతి రూ.100 పెట్టుబడిలో 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయని వివరించిన మంత్రి, చాలా మంది తనను ఇది ఎలా సాధ్యమవుతుందని అడుగుతుంటారు. వారందరికీ తాను మూడు ‘S’లతో సమాధానం చెబుతానన్నారు. వాటిలో మొదటిది వేగం (Speed) అయితే రెండవది స్థిరత్వం (Stability), మూడవది సేవ (Service) అని విశదీకరించారు. ఒకసారి మీరు తమ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాక, అది కేవలం మీ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అది తమ రాష్ట్ర ప్రాజెక్ట్ కూడా అవుతుందని తెలిపిన మంత్రి, వ్యాపారవేత్తలకు సహాయం చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోసా అందించారు. ప్రస్తుతం 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఆంధ్రప్రదేశ్, భవిష్యత్తులో 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగనుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ తమ ఈ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాల్సిందిగా పారిశ్రామిక వేత్తలను కోరారు.

ఐసిసి ఉపాధ్యక్షులు, సెంచరీ ప్లైబోర్డ్స్ (ఇండియా) లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేశవ్ భజంకా మాట్లాడుతూ నారా లోకేష్ గారి ముందుచూపు , వ్యూహాత్మక ఆలోచనా విధానం అద్భుతమైనవి, సాటిలేనివని కొనియాడారు. రెండు నెలల క్రితం తాము సమావేశమైనప్పుడు బెంగాల్ నుండి పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశాలపై చర్చించామని చెబుతూ ఈ రోజు ఇలా పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయనతో కలిసి ఉండటం అదృష్టం, గౌరవంగా భావిస్తున్నామన్నారు. స్టాన్‌ఫోర్డ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత దేశ నిర్మాణానికి తనను తాను అంకితం చేసుకున్న లోకేష్ వంటి గొప్ప వ్యక్తిని చూడటం సంతోషంగా ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ బ్రాండ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నామన్నామన్నారు.

సెంచరీప్లై బోర్డ్స్ 2024లో బద్వేల్ ప్లాంట్ నుండి మీడియం డెన్సిటీ ఫైబర్‌బోర్డ్ (ఎండిఎఫ్) వాణిజ్య సరఫరాను కూడా ప్రారంభించింది. బద్వేల్ ప్లాంట్ ప్రారంభం తర్వాత, ఈ బ్రాండ్ తన ఎండిఎఫ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 900 నుండి 1900 క్యూబిక్ మీటర్లకు పెంచింది. సెంచరీప్లై యొక్క బద్వేల్ యూనిట్ సుమారు 2,200 మందికి ఉపాధి కల్పించింది. అంతేకాకుండా, కంపెనీకి అవసరమైన ముడి సరుకును బద్వేల్ ప్రాంతంలోని రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తోంది. భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి, రాబోయే 8 ఏళ్లలో 80,000 ఎకరాలలో ప్లైవుడ్ తయారీకి ఉపయోగపడే చెట్లను నాటాలని రైతులను ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఇప్పటికే 1,000 మంది రైతులు రాయితీ ధరతో 5,000 ఎకరాలలో చెట్లను నాటడానికి ముందుకు వచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -