Sunday, June 21, 2026
E-PAPER
Homeజాతీయంమలయాళ సాహిత్యంలో విషాదం..నారాయణ కురుప్ కన్నుమూత

మలయాళ సాహిత్యంలో విషాదం..నారాయణ కురుప్ కన్నుమూత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రముఖ మలయాళ కవి, సాహితీ విమర్శకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత పి. నారాయణ కురుప్ (92) కన్నుమూశారు. తిరువనంతపురంలోని పెరూర్కడలోని తన నివాసంలో ఆయన నిన్న అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మలయాళ సాహితీ లోకం తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని వ్యక్తం చేస్తోంది. 1934 సెప్టెంబర్ 5న అప్పటి ట్రావెన్‌కోర్ సంస్థానంలోని హరిపాడులో జన్మించిన నారాయణ కురుప్, కవిగా, విమర్శకుడిగా మలయాళ సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాహితీ సేవ చేసిన ఆయన, సంప్రదాయ మరియు ఆధునిక సాహిత్య ప్రక్రియలపై చెరగని ముద్ర వేశారు. కేవలం రచయితగానే కాకుండా కథాకళి, కూడియాట్టం వంటి శాస్త్రీయ కళల విమర్శకుడిగా, ప్రోత్సాహకుడిగా ఆయన విశేష ఖ్యాతి గడించారు. తపస్య, మార్గి వంటి పలు ప్రతిష్టాత్మక కళా, సాహిత్య సంస్థలకు అధ్యక్షుడిగా కూడా ఆయన సేవలందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -