Sunday, June 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్

- Advertisement -

నవతెలంగాణ-టేకుమట్ల 
హనుమకొండ భీమారం తులసి గార్డెన్లో ఉమ్మడి చిట్యాల మండల మాజీ ఎంపీపీ పేర్కారి జయసుధ విష్ణువర్ధన్ రావుల కుమార్తె శ్రీజ ప్రణయ్ రావుల వివాహానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యఅతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమంలో టేకుమట్ల మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణిగుంట్ల శంకర్ మాదిగ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కామిడి రత్నాకర్ రెడ్డి, తోట గట్టయ్య, ఏనుగు లచ్చిరెడ్డి, గర్మిళ్లపల్లి ఉపసర్పంచ్ నల్లబెల్లి మొండయ్య, మద్దెల కుమార్, నందునాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -