బీఆర్ఎస్ నేత డాక్టర్ అంజిరెడ్డి
నవతెలంగాణ-నసురుల్లాబాద్
యూరియా యాప్ ను రద్దు చేసి, రైతులకు సరిపడా యూరియాను అందించాలని బాన్సువాడ నియోజకవర్గ సీనియర్ నేత డాక్టర్ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత డాక్టర్ అంజిరెడ్డి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, యూరియా ద్వారా రైతులకు అనేక అవసరాలు ఏర్పడ్డాయని అన్నారు. రైతులకు సరైన యూరియా అందకపోవడంతో దిగుబడి కూడా తగ్గుతుందని అన్నారు.
ఇప్పటికి యూరియా అవసరాల కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడుతున్నారని అన్నారు. విత్తనాల ధరలు ఎరువుల ధరలు పెంచారని, దీంతో రైతులకు సాగుకు విపరీతమైన భారం పడుతుందని అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులు ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు చేయాలని, నకిలీ విత్తనాల అమ్ముతున్న షాపులపై పీడి యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, విఠల్ సార్, భూమయ్య, డి,సాయిలు, లక్ష్మణ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



