Sunday, June 21, 2026
E-PAPER
Homeజాతీయంరొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి

రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి

- Advertisement -

మరో 21 మంది పరిస్థితి విషమం..
నవతెలంగాణ – హైదరాబాద్:
తమిళనాడులో ఓ రొయ్యల ఫ్యాక్టరీలో ఆదివారం ఘోరప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలో అమ్మోనియం గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 70 మంది కార్మికులు ఉండగా.. 21 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరో 40 మంది కార్మికులు కూడా అస్వస్థతకు గురవ్వగా వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -