ఐరిష్ నమోదు కాకపోతే వేలిముద్రల సేకరణ
నవతెలంగాణ – మల్హర్ రావు
ఆసరా (చేయూత) పెన్షన్ల పంపిణీని మరింత పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫేషియల్ రికగ్నజేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) అమలు మండలంలో కొనసాగుతోంది. అర్హులైన వారికి పింఛన్ అందిస్తూ,అనర్హులు, మృతుల పేర్లను జాబితా తొలగించాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈనెల 22 నాటికే ప్రక్రియను ముగించాల్సి ఉన్నా..సాంకేతిక కార ణాలు, ఎస్ఆర్ఎస్ లో లబ్దిదారుల ఐరిస్ నమోదు కాకపోవడంతో వంటి కారణాలతో జాప్యం జరుగుతుంది.ఈ నేపథ్యాన త్వరలోనే పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.
84 శాతం పూర్తి..
మండలంలో 3,680 మంది వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. అందులో ఇప్పటివరకు 3,097 మంది(సుమారు 84 శాతానికి పైగా) లబ్దిదారుల ఎస్ఆర్ఎస్ గుర్తింపు పూర్తయింది.మిగిలిన583 మంది గుర్తింపు చేపట్టాల్సి ఉంది.ముఖ గుర్తింపునకు ప్రాధా న్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.దీంతో మండలంలో 3,097 మంది లబ్ధిదారులను ముఖ గుర్తింపు ద్వారా జీవించి ఉన్నట్లు తేల్చారు. లైవ్ ఆథంటికేషన్ తీసుకునేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆధార్ ఆధారంగా వేలిముద్రలు సేకరించి వివరాలు ఖరారు చేసుకుంటారు.ఇందు కోసం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మండలానికి బయోమెట్రిక్ మిషన్లను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది.
గ్రామాల్లో లబ్ధిదారుల వద్దకు పంచాయతీ సిబ్బంది వెళ్లి వారి వేలిముద్రలను నమోదు చేస్తారు.మండలంలో ఇప్పటికే అధికారులు 15 మంది మరణించిన,2 మానసిక,ఆధార్ తప్పువున్న ఒక్కరినీ,ఆధార్ అప్ డేట్ కానివి 31 మంది,ఆధార్ రెస్పాన్స్ 11 మందివి,అందుబాటులో ఉండని,వలస వెళ్లిన 523 మందిని గుర్తించారు.మిగిలిన 583 మందికి కూడా వీలైనంత త్వరగా ఈ-కేవై సీ లేదా ఎస్ఆర్ఎస్ పూర్తి చేయాలని యంత్రాంగం భావిస్తోంది.



