Friday, February 20, 2026
E-PAPER
Homeజాతీయంసర్జరీ తర్వాత చూపు కోల్పోయిన 9 మంది..

సర్జరీ తర్వాత చూపు కోల్పోయిన 9 మంది..

- Advertisement -

యోగిపాలనలో అంతులేని విషాదం..ఆస్పత్రి మూసివేత
లక్నో : శస్త్రచికిత్స తర్వాత కొందరి కండ్లకు ఇన్ఫెక్షన్‌ సోకి తొమ్మిది మంది చూపుకోల్పోయారు. ఈ ఘటనపై వెంటనే అధికారులు స్పందించారు. ప్రయివేట్ ఆస్పత్రికి సీల్‌ వేశారు. మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జరిగింది. న్యూ రాజేష్‌ హై-టెక్‌ ఆస్పత్రిలో ఫిబ్రవరి 1న కంటి శిబిరం నిర్వహించారు. ఆ రోజు సుమారు 30 మంది కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. వీరిలో 18 మందికి కొన్ని రోజుల్లోనే కండ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చాయి.

వారిలో తొమ్మిది మంది కంటి చూపు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాలు ఆందోళన చెందాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, లక్నో, వారణాసిలోని సూపర్‌-స్పెషాలిటీ ఆసుపత్రులకు పలువురిని తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, మరోవైపు ఆ ప్రయివేట్‌ ఆస్పత్రిని ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నేత్ర వైద్య విభాగాన్ని సీజ్‌ చేశారు. మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించినట్టు జిల్లా కలెక్టర్‌ తెలిపారు. నివేదిక అందిన తర్వాత సంబంధిత డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరైనా దోషిగా తేలితే, వారి రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -