సుప్రసిద్ధ కవి డా. ఎన్.గోపి రచించిన కవితా సంపుటి “రెప్పలు దాటని లోకం” ఆవిష్కరణ జూన్ 25 సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ రవింద్రభారతి సమావేశ మందిరం, (మొదటి అంతస్తు)లో జరుగుతుంది. ఆవిష్కర్త డా. కె.వి. రమణాచారి ఐఏఎస్, (రిటైర్డ్), కృతి స్వీకర్త ఆశారాజు. డా. ఏనుగు నరసింహారెడ్డి ఐఏఎస్, డా. ఎస్. రఘు, కుడికాల వంశీధర్, డా. గిన్నారపు ఆదినారాయణ, ప్రొఫెసర్ జె.నీరజ పాల్గొంటారు.
కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్
సాహితీకిరణం 17వ వార్షికోత్సవ వేడుకలు
సాహితీకిరణం 17వ వార్షికత్సోవ వేడుకలు జూన్ 24వ తేది బుధవారం హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభ కళాసుబ్బారావు కళావేదికపై నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పింగళి కమలాకేసరి నెలకొల్పిన డా॥పింగళి జగన్నాథరావు సాహిత్య స్మారక పురస్కారాన్ని కవి రచయిత, గాయకుడు చిమ్మపూడి శ్రీరామమూర్తికి, సిరిగాద శంకర్ నెలకొల్పిన సిరిగాద నరసయ్య, బాలమ్మల సాహితీ స్మారక పురస్కారాలను కవి, రచయిత డా॥వైరాగ్యం ప్రభాకర్, సినీ వ్యాసరచయిత్రి సి.వి.ఆర్.మాణిక్యేశ్వరిలకి అందజేస్తారు.ఈ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర పూర్వ సలహాదారులు డా॥కె.వి.రమణ విచ్చేస్తుండగా నేటినిజం సంపాదకులు బైసదేవదాసు సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. సభలో కళా వి.ఎస్.జనార్దనమూర్తి, డా॥వై.రామకృష్ణారావు, డా॥వంశీ రామరాజు, పొత్తూరి సుబ్బారావు, పెద్దూరి వెంకటదాసు, పొత్తూరి జయలక్ష్మి, వి.వి.రాఘవరెడ్డి పాల్గొంటారు.
పొత్తూరి సుబ్బారావు, సంపాదకులు
‘రెప్పలు దాటని లోకం` ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -


