Sunday, June 21, 2026
E-PAPER
Homeదర్వాజప్రజలే ప్రభువులు

ప్రజలే ప్రభువులు

- Advertisement -

దండు కడితే మిడతలు
ప్రపంచాన్నే వనికిస్తాయి
​బారు కడితే చీమలు
పాములనే వధిస్తాయి
​పెన వేసుకున్న గడ్డి పోచలు
ఏనుగులనే బంధిస్తాయి
​ఓ… మనిషి.. తెలుసుకో
​నీవు గర్జిస్తే
రాజ్యం గజగజ వనకాల్సిందే
​నిలదీస్తే పాలకులు
నీ ముందు మోకరిల్ల వలసిందే
​ప్రభుత్వాలు ఏవైనా
నీకు
సేవ చేయడానికే…కానీ
స్వారీ
చేయడానికి కాదు
​ప్రభువులెవ్వరూ..లేరిక్కడ
​ప్రజాస్వామిక
వ్యవస్థలో
ప్రజలే ప్రభువులు
​ఓ… నా దేశ..పౌరుల్లారా
​ప్రజలెప్పుడూ
ప్రవహించే నదిలా ఉండాలి
​గనీభవించిన శిల లా కాదు
​పౌర చైతన్యమే కదా !
ప్రజాస్వామ్యానికి
శ్రీరామ రక్ష
​.. బత్తుల శ్రీనివాసులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -