- Advertisement -
నోరుంది మాట్లాడుతా
కానీ చదవలేను
చెవులున్నాయి వింటాను
తిరిగి చెప్పలేను సరిగా
లింకు తెగింది
ప్రశ్నలున్నాయి
జవాబులు కావాలి
గూగూల్ ఇస్తుందిగా
చదవడమే రాదు సరిగా
లింకు తెగింది.
కళ్లున్నాయి
చూసింది చూపలేను మెరుగ్గా
సెల్ వుంది నకిలీనే
భాషలేదు భావంలేదు
రాయడం రాదు
బండరాయినా..?
అమ్మో! భయంగా వుంది
ఇంద్రియాలు పనిచేయవు సరిగా
ఎ. ఐ. వుందిగా..
నాణ్యం నైపుణ్యం అటకెక్కిందా..?
ఇక నేనెవర్ని?
స్టూడెంట్నా..? టీచర్నా..?
ఎంప్లాయినా..? మనిషినా..?
ఏమోమరి?
లింకు తెగింది..
కె.శాంతారావు
- Advertisement -



