Sunday, June 21, 2026
E-PAPER
Homeదర్వాజనా సమాధి

నా సమాధి

- Advertisement -

వాళ్ళు అతన్ని చంపేసి
రాత్రికల్లా పూడ్చేసారు.
వాళ్ళు అతని శవాన్ని కడగలేదు,
ఎవరూ అతని గురించి ప్రార్థించలేదు.
నేను హత్యకు గురైన వారి సమాధిని తవ్వి,
మృతదేహాన్ని నీళ్ళతో కడగాలని
ప్రజా సమూహం ముందు
అంత్యక్రియల ప్రసంగాన్ని చేయాలని కోరుకున్నాను.
కానీ ఏం జరిగింది ?
సమాధి ఎక్కడుందో నాకు తెలీదు
సమాధి వుందో లేదో నాకు తెలీదు
శవం వుందో లేదో నాకు తెలీదు.
కానీ, హతుడు ఈ రాత్రికి
దేవుని గవాక్షం అధిరోహించి
తన ముగింపుని పలుకుతాడని నాకు తెలుసు.
నేను ఒక సమాధిని తవ్వాలనుకున్నాను.
కానీ, ఏం జరిగింది ?
నా సమాధిని నేనే తవ్వుకోవాలా ?
సమీఁ అల్ – ఖాసిమ్ ( 1934 – 2014 ) పాలస్తీనా కవి
అనువాదం : పి.శ్రీనివాస్ గౌడ్ ,9949429449

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -