నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి నలంద హైస్కూల్ లో కమ్యూనిటీ పోలీసింగ్, సైబర్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ షీ టీమ్ అవగాహనా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో భాగంగా ముఖ్య అతిది గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి. సత్యనారాయణ గౌడ్ పాల్గొని విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ఇందులో నలంద హై స్కూల్ కరెస్పాండంట్ యల్. ప్రసాద్, ప్రిన్సిపాల్ యల్. సాగర్, షీ టీమ్ పోలీస్ బృందం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పరీక్షలో నలంద విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
ఈ అభ్యస్ ఐఐటి అండ్ ఒలంపియాడ్ అకాడమీ హైదరాబాద్ వారు ఈనెలలొ రాష్ట్ర స్థాయిలో బి- మ్యాట్ బోస్ మెడికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇటీవల నిర్వహించినట్టు పాఠశాల యాజమాన్యం శుక్రవారం తెలిపారు. ఈ రాష్ట్రస్థాయి టెస్టులో నలంద విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను నలంద యాజమాన్యం అభినందించారు. ఐఐటి ఒలంపియాడ్ ఇంచార్జ్ ఉపాధ్యాయులు స్వరూప, శారద, నిఖిల, స్వప్న, ప్రియాంక మేడం,రాజశేఖర్ , షాకీర్ లను అభినందించారు.
పట్టణ ప్రాంతంలో ఐఐటి, ఒలంపియాడ్ తరగతులను నిర్వహిస్తున్న ఏకైక విద్య సంస్థ నలంద హైస్కూల్ అని గర్వంగా చెప్పారు. ఇప్పటివరకు విద్యార్థులకు చాలా కాంపిటీటివ్ పరీక్షలు నిర్వహించామని, ఈ నెలలో ( కలాం సైంటిఫిక్ ఆటిట్యూడ్ టెస్ట్ -2) రాష్ట్రస్థాయి పరీక్ష ఈ -అభ్యస్ హైదరాబాద్ వారు నిర్వహిస్తున్నారని తెలిపారు.



