నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో ఏడవ వార్డు, సుభాష్ నగర్ కాలనీలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలో శుక్రవారం వార్డు పరిశీలించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ సమస్యలను వీలైనంతవరకు పరిష్కరిస్తున్ననాని తెలియజేశారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ బీజనా బాలమణి భాస్కర దంపతులకు శాలువాల పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగొండ శ్రీకాంత్ ,కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి మహేష్,దూడల రాజశేఖర్ ,సతీష్ కుమార్ ,ఆలేటి అనిల్ ,కాలనీ వాసులు కమిటీ కారి వెంకటేష్ , జి నరసింహులు, కే హనుమంతు,పరుష నాగరాజు, మునీర్ పాషా ,మైదం నవీన్ ,ముక్క వికాస్ ,జలీల్ మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.


