నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ ఎంపీయుపిఎస్ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినిలు గురుకుల పాఠశాలకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో తమ పిల్లలకు మంచి విద్యను అందించి ఉన్నతంగా జీవించేందుకు సహకరించిన సందర్భంగా సోమవారం విద్యార్థినిల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయునికి, ఉపాధ్యాయ బృందాన్ని సన్మానించారు. అనంతరం గ్రామ సర్పంచ్, హెచ్ఎం మాట్లాడుతూ.. 8వ తరగతి చదువుతున్న ఎన్. బాలమణి, ఎన్. శైలజ ఇద్దరు అక్క చెల్లెలు గురుకుల పాఠశాలకు ఎంపికవడం గ్రామానికే గర్వకారణమన్నారు. ఇద్దర్లో ఒకరికి కొడప్గల్ గురుకుల, మరొకరికి పెద్ద ఏక్లారా గురుకుల పాఠశాలలో సీటు రావడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొంగడి, గ్రామ పాలక మండలి, గ్రామస్తులు, ఉపాధ్యాయ బృందం రుక్సానా, సుభాష్ పటేల్, మధు, తుకారం, తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థుల తల్లిదండ్రులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



