Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యల వలయంలో హాస్టళ్లు

సమస్యల వలయంలో హాస్టళ్లు

- Advertisement -

తలుపులు లేని బాత్రూములు
ఇప్పటివరకు ఒక్కరు కూడా రాని విద్యార్థులు
నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ 

గిరిజన సంక్షేమ వసతిగృహాలకు విద్యార్థులు ఇప్పుడిప్పుడే చేరుతున్నారు. ఈ నెల 15 నుండి పాఠశాలలు ప్రారంభం కాగా పిల్లల తల్లిదండ్రులు కొత్త విద్యార్థులైతే వారి వసతి సదుపాయాలను హాస్టళ్లలో ఎలా ఉన్నాయనే విషయాన్ని గమనించి చేర్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. గతంలో చేరిన విద్యార్థులు పై తరగతులకు వెళ్లే వారైతే ఒక్కొక్కరిగా వసతి గృహాలకు చేరుకుంటున్నారు. వసతి గృహాల్లో విద్యార్థులను చేర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో గ్రామాల్లో ఉపాధ్యాయులు పర్యటించి వారి పేర్లను నమోదు చేసుకున్నారు.

మండలంలోని చావుని తాండ గ్రామంలో గిరిజన సంక్షేమ బాలుల వసతి గృహం గత కొన్ని సంవత్సరాల క్రితం తాండ ప్రాంతాల్లో పేదవారు నివసిస్తారు గనక వారికి చదువుకునే సౌకర్యార్థం ఈ గిరిజన వసతి గాని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ వసతి గృహంలో 3వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యార్థులు చేరే అవకాశం ఉంది. సుమారు 200 మంది విద్యార్థులకు వసతి సదుపాయం అందుబాటులో ఉంది. వసతి గృహంలో ఇప్పటివరకు ఒక్క విద్యార్థి కూడా రాకపోవడం గమనార్హం. గత సంవత్సరంలో వార్డెన్ గా నిర్వహించిన వాళ్ళు మెరుగైన భోజనం సరైన వసతులు కల్పించకపోవడం వల్ల విద్యార్థులు రావడానికి భయపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత విద్యా సంవత్సరంలో దాదాపు 100కు పైనే విద్యార్థులు ఉన్నారని, ప్రస్తుతానికి సీట్లు కాలీగా ఉన్నప్పటికీ గత సంవత్సరం చదివిన విద్యార్థులు ఇప్పటివరకు రాకపోవడం, కొత్త అడ్మిషన్లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపకపోవడం పట్ల వసతి గృహాల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ వసతి గృహానికి జిల్లా అధికారుల పరిరక్షణ లేకపోవడంతో సమస్యలతో వసతి గృహం దర్శనమిస్తుంది.

తగ్గిన విద్యార్థుల సంఖ్య
విద్యార్థులు చదువుల కోసం ప్రభుత్వాలు కొత్త విధానాలను ప్రవేశ పెడుతుండగా గతంలో ఉన్న సంక్షేమవసతి గృహాలు విద్యార్థుల సంఖ్య లేక మూతపడే స్థాయికి వస్తు న్నట్లు విద్యావేత్తలు చెపుతున్నారు. ప్రభుత్వం ప్రతి మండలానికి కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ను ప్రవేశ పెట్టడం జరిగింది. గత పదేళ్లుగా ఆ పాఠశాలల్లోవ సతి సదుపాయంతో పాటు మెరుగైన విద్యను అందిస్తున్నారు. సాంఘీక సంక్షేమ శాఖ ఆద్వర్యంలో గురుకులాలు ఎంతో బాగా నడుస్తున్నాయి.

ప్రతి ఏటా రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించి అర్హత కలిగిన విద్యార్ధులు ఆయా పాఠశాలలో చేరిపోతున్నారు. ఎంతో మెరుగైన విద్యతో పాటు భోజన వసతిని కల్పిస్తుండగా, ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులను చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తిని చూపడం లేదంటున్నారు. వసతి గృహాల్లో చేరే విద్యార్థులు మరో చోట ఉన్న పాఠశాలలో చదువుకోవాల్సి ఉంటుంది. అందు కోసమే విద్యార్థులు వసతి గృహాల్లో చేరేందుకు ఆసక్తిని తల్లిదండ్రులే కాకుండా విద్యర్థులు కూడా చూపడం లేదు. ఆదే క్రమంలో వసతి గృహాల్లో చేరాలంటూ ఉపాధ్యాయులు ఇంటిం టికి తిరిగి విద్యార్థులను చేర్చేందుకు నానా అవస్థలకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో వసతి గృహాలకు మనుగడ అసాధ్యమని విద్యేవేత్తలు అంటున్నారు.

వసతులు అంతంత మాత్రమే
గత సంవత్సరం 130 విద్యార్థులు ఉన్నప్పటికీ మలవిసర్జనకు వెళ్లడానికి ఐదు బాత్రూంలు, స్నానం చేయటానికి ఐదు స్నానపు గదులు మాత్రమే ఉన్నాయి. విశాలమైన గదులు ఉన్నప్పటికీ వాటి కిటికీలకు దోమతెరలు లేకపోవడం, ఫ్యాన్లు సరిగ్గా పని చేయకపోవడం, వర్షాకాలం హాస్టల్ చుట్టూ నీళ్లు నిలిచి దోమల బెడద ఎక్కువ కావడంతో మెరుగైన భోజనం అందించకపోవడం వల్ల ఈ సంవత్సరం విద్యార్థులను పంపడానికి తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. ఈ సంవత్సరమైనా సంబంధిత అధికారులు చొరవ చూపి వసతి గృహాలను బాగు చేసి, పేద విద్యార్థులకు మెరుగైన భోజనంతో పాటు నాణ్యమైన విద్య అందించాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -