Friday, February 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్విద్యుత్ స్తంభం విరిగి మహిళకు తీవ్ర గాయాలు

విద్యుత్ స్తంభం విరిగి మహిళకు తీవ్ర గాయాలు

- Advertisement -

అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తుల ఆగ్రహం ..
నవతెలంగాణ – ముధోల్ 

ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యుత్ స్తంభంపై కొండముచ్చు దూకడంతో ఆ స్తంభం విరిగి సమీపంలో ఉన్న మహిళపై పడటంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనకు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు మండిపడ్డారు. స్థానికుల కధనం  ప్రకారం, బైంసా మండలంలోని మహగాం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన కుమార్తె ఇంటికి చించాల గ్రామానికి వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఇంటి బయట ముఖం కడుక్కుంటుండగా సమీపంలోని విద్యుత్ స్తంభంపై కొండముచ్చు దూకింది. అప్పటికే బలహీన స్థితిలో ఉన్న ఆ స్తంభం ఒక్కసారిగా విరిగి నేరుగా మహిళపై పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, చించాల గ్రామంలో పలు విద్యుత్ స్తంభాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇనుప చువ్వలు బయటకు కనిపించే స్థితికి చేరుకుని ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని వాపోయారు.ఈపడ్డ స్తంభంకూడా గతంలో అధికారులు పడిపోతాదాని దానికున్న తీగలు తొలగించి పక్కకు వేరే స్తంభం వేశారు కానీ ఈ స్తంభం తొలగించలేదని గతంలోనే తొలగిస్తే ఈ ప్రమాదం జరిగేది కాదని గ్రామస్తులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి దారితీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాయపడిన మహిళకు అయ్యే పూర్తి వైద్య ఖర్చులను విద్యుత్ శాఖ అధికారులు భరించాలని గ్రామ పెద్దలు, బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలను తక్షణమే తొలగించి కొత్తవాటిని ఏర్పాటు చేయాలని హెచ్చరించారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -