Monday, June 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలి

- Advertisement -

సీపీఐ పరకాల ఇంచార్జి ఎం. సదా లక్ష్మి
నవతెలంగాణ – పరకాల 

అర్హులైన నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం పరకాల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ ధర్నాలో సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. పరకాల పట్టణంలోని 98 సర్వే నంబర్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని కోరారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ప్రభుత్వం నుండి గానీ, ఎమ్మెల్యే నుండి గానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని సిపిఐ పరకాల ఇంచార్జి ఎం. సదా లక్ష్మి, మండల కార్యదర్శి దుప్పటి సాంబయ్య పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -