జిల్లా కలెక్టర్ హనుమంతరావు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
రోడ్ల పై సంచరించి బ్రతికే జంతువుల నియంత్రణకు సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో రోడ్లపై సంచరించే ఆవులు, కుక్కలు మరియు ఇతర జంతువులను గుర్తించి వాటిని ఒక షెల్టర్ కు తరలించాలని సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు సలహాలు జారీ చేశారు.
గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వీధుల్లో తిరిగే జంతువులను ప్రత్యేకంగా గుర్తించి, వాటికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జంతువుల కోసం ప్రత్యేక షటర్లు ఏర్పాటు చేసి వాటికి స్టెరిలైజేషన్ చేయాలన్నారు. రోడ్లపై జంతువులు సంచరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ శాఖ అధికారి , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.



