సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు: సయ్యద్ వలి
నవతెలంగాణ – ఆత్మకూరు
తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తురక కాశ బండ కొట్టే కార్మికులు, అత్యంత వెనుకబడిన కులాల్లో ఒకటైన ఈ సామాజిక వర్గాన్ని గుర్తించి మైనార్టీ శాఖ బడ్జెట్‌లో ప్రత్యేక సంక్షేమ పథకం ఏర్పాటు చేసినందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా తురక కాశ కార్మికుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందుతుంది. వారి జీవనోపాధికి పనిముట్లు, జెనరేటర్లు మంజూరు చేస్తూ ‘తురక కాశ’ పేరుతో ప్రత్యేకంగా రూపొందించారు.
రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్న ఈ కార్మికుల ఉపాధికి ఇది మంచి మద్దతుగా ఉంటుందని సయ్యద్ వలి హర్షం వ్యక్తం చేశారు.గత తొమ్మిది సంవత్సరాలుగా షేక్ ఇమామ్ పాషా నాయకత్వంలో తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి బలోపేతం చేసి మునుపటి పాలకులకు ప్రత్యేక పథకం కోరి విన్నపించినా విస్మరించారని, కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తమ హక్కులను గుర్తించి చేర్చినందుకు సంతోషం చెప్పారు. మైనార్టీ శాఖ మంత్రి ఎండి అజారుద్దీన్ లకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తురక కాశ సోదరులు ఈ పథకాన్ని పొందడానికి అర్హులైన వారంతా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని వలి కోరారు.



