నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో నిర్మిస్తున్న నూతన అయ్యప్ప ఆలయానికి స్థానిక శ్రీ రాజరాజేశ్వర ఎలక్ట్రికల్స్ యజమాని గణపురం రవి రూ.1 లక్ష విరాళం అందజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ.1 లక్ష మొత్తాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు విరాళంగా అందజేశారు. ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా తోడ్పాటు అందించిన గణపురం రవిని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.వారికి, వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, అయ్యప్ప ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు బద్దం రాజశేఖర్, సురంగి చంద్రశేఖర్, వడ్ల మోహన్, తిరుమలేష్, మాధవ్, మల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



