నవతెలంగాణ-అచ్చంపేట
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రయివేట్ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, ఫీజులు నియంత్రించాలని సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో వినపత్రం ఇచ్చారు. ప్రయివేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణకు డిఎఫ్ఆర్సి సమావేశమై 2026 – 2027 విద్యా సంవత్సరం ఫీజుల నిర్ధారణ చేయాలని, ప్రతి పాఠశాల అకౌంట్, సొసైటీ ట్రస్టుల ఆడిట్ లను ఆర్డిఓ స్థాయి జ్యుడీషియల్ అధికారుల ద్వారా చేయించాలని, ఫీజుల వివరాలను పాఠశాల నోటీస్ బోర్డుపై, విద్యాశాఖ పాఠశాల వెబ్సైట్లో ఉంచాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
“ఆంధ్ర ప్రదేశ్ విద్యా చట్టం 1982, దాని నియమాలు 1993 పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సవరణ చట్టం 2019, విద్య హక్కు చట్టం 2009, వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం.. పాఠశాలలు సరైన ఖాతాలను నిర్వహించాలి. అన్ని ఫీజు చెల్లింపులకు అన్ని వివరాలతో రసీదులు జారీ చేయాలి రసీదులు చెల్లింపులకు రుజువుగా పనిచేస్తాయి. అధిక ఫీజుల చెల్లింపుకు వివాదాలకు పరిష్కారానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు యూనిఫామ్ తల్లిదండ్రులని కొనుగోలు చేయమని చెప్పాలి. ప్రస్తుతం ప్రయివేట్ పాఠశాలలు ఈ విషయాన్ని వ్యాపారంగా మార్చి లబ్ధి పొందుతున్నాయని” పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బండపల్లి శ్రీనయ్య, ఉపాధ్యక్షులు బాలు, ఉపాధ్యక్షులు శివకుమార్, జనరల్ సెక్రెటరీ కొండల్, కన్వీనర్ శేఖర్ ఉన్నారు.



