Monday, June 22, 2026
E-PAPER
Homeఖమ్మంరేపు బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు..ఎస్‌ఐఆర్ పై అవగాహన

రేపు బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు..ఎస్‌ఐఆర్ పై అవగాహన

- Advertisement -

– హాజరు కానున్న శాసనసభ పక్ష నేత హరీష్ రావు 
– విజయవంతం చేయాలని పిలుపు
– విలేకరుల సమావేశంలో నియోజకవర్గం ఇంచార్జి ఉప్పల వెంకటరమణ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

బీఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్‌ఏ) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)పై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఉప్పల వెంకటరమణ తెలిపారు.  సోమవారం స్థానిక కాసాని నాగశేషపద్మ – చంద్రమోహన్ గృహం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అశ్వారావుపేట భద్రాచలం రోడ్డులోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ కార్యక్రమం జరగనుంది అని అన్నారు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు అని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పెరాయిగూడెం, గుర్రాల చెరువు ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, సోషల్ మీడియా వారియర్స్, ఉద్యమకారులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు, సభ్యత్వ నమోదు మండల కో-ఆర్డినేటర్లు, బూత్ ఇన్‌చార్జీలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ టౌన్ అధ్యక్షులు సత్యవరపు సంపూర్ణ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావు జోగేశ్వరరావు,యూఎస్ ప్రకాశ్ రావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -