Tuesday, June 23, 2026
E-PAPER
Homeసినిమాఅభినందనీయ ప్రయత్నం

అభినందనీయ ప్రయత్నం

- Advertisement -

దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై గే, ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా ‘ఎల్ జి బీ టీ – ఏ లీగల్ బ్యాటిల్. ఈ చిత్రంలో ఎల్ బి శ్రీరామ్, ఎస్తర్ నార్నోన్హ, రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్ తో పాటు రియల్ ట్రాన్స్జెండర్ యాక్టర్స్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 19న దేశవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గే, ట్రాన్స్ జెండర్స్ కు అండగా నిలుస్తున్న పలు సేవా సంస్థల నిర్వాహకులను సత్కరించారు. ఈ సందర్భంగా నటుడు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ,'ఈ సినిమాతో సునీల్ కుమార్ రెడ్డి ఒక చరిత్ర సృష్టించారు. గే, ట్రాన్స్ జెండర్ సమస్యలు చెబుతూ వచ్చిన ఫస్ట్ సినిమా ఇదే. శంకరాభరణం సినిమా ఒక చరిత్ర సృష్టించింది. ఈ అర్థనారీశ్వర సినిమా మరో చరిత్ర సృష్టించబోతోంది అని తెలిపారు.
‘మా సినిమాను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఎన్నో ఆర్గనైజేషన్స్, మీడియా మిత్రులు, ఛారిటీ సంస్థలు మా మూవీని ప్రశంసిస్తున్నాయి. ఈ సినిమా రూపొందించడం వెనక ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ట్రాన్స్ జెండర్స్ విషయంలో ఉన్న వివక్ష తొలగిపోవాలని, వారికీ సమానత్వం ఉండాలని చెప్పేందుకు ఈ సినిమాను రూపొందించాను` అని డైరెక్టర్ పి.సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -