ఈనెల 24న రచయిత, నిర్మాత, దర్శకుడు అల్లాణి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్ సీనియర్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షులు బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమం ద్వారా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ చిరు సత్కారం చేయాలని అనుకుంటున్నాం. అల్లాణి శ్రీధర్ గురించి చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకున్నట్లు ఉంటుంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేఅని అన్నారు. 'శ్రీధర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించాలి అని ఫిలిం క్రిటిక్స్ జనరల్ సెక్రటరీ సురేష్‌కొండేటి చెప్పారు.
అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ,’నేను నా వృత్తిలో ఏ రోజు సెలవు తీసుకోలేదు. ఏఐ స్టూడియోస్ పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఓ ప్రముఖ వ్యక్తి బయోపిక్ చేస్తున్నాం. అరుదై పోతున్న బాలల చిత్రాలను రూపొం దిస్తాను. సింగీతం శ్రీనివాస రావు ఈ వయసులో కూడా ఒక అద్భుతమైన సినిమా చేశారు. నాగేశ్వరావు యాక్టింగ్ చేస్తూనే పోవాలని అనుకుంటున్నాను అన్నారు. ఇలా చివరి శ్వాస వరకు పని చేస్తూనే ఉండాలన్నది నా కోరిక. సినిమా అనేది ఒక రెవెల్యూషన్‌లా అయిపోయింది. మాధ్యమాలు మారి పోయాయి కాబట్టి కుటుంబానికంటే కూడా డబ్బుకంటే కూడా ఐడియాకే ఎక్కువ శక్తి ఉన్న సమయం ఇది. ఒక ఐడియా అనేది శిఖరం లాంటిది. ఇంకా ఈ వేడుకలో జాయింట్ సెక్రటరీ శ్యామ్ కుమార్, పర్వీన్‌బాబి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మామిడాల గిరిధర్, ఆర్.డి.ఎస్ ప్రకాశ్, కేశవాచారి, కుమారస్వామి పాల్గొన్నారు.
బాలల చిత్రాలు చాలా అరుదుగా వస్తున్నాయి
- Advertisement -
- Advertisement -



