అదంతా అమెరికా మీడియా షో అంటూ బహిష్కరణ
తుది ఒప్పందంపై ఉద్రిక్తతల నడుమ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా చర్చల అనంతరం గ్రూప్ ఫొటోను ఇరాన్ బహిష్కరించింది. అమెరికా ప్రతినిధులతో కలిసి ఫొటో దిగేందుకు ఇరాన్ నేతలు నిరాకరించారు. అదంతా ‘అమెరికా మీడియా షో’ అని ఎద్దేవా చేశారు. అయితే ఆ తర్వాత 80 నిమిషాల పాటు చర్చలు కొనసాగాయని ఇరాన్ అధికారులు చెప్పారు. అయితే ట్రంప్ బెదిరింపులపై ఇరాన్ వైపు నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే మంచిదని ఇరాన్ చర్చల ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ఖలీబఫ్ చురక వేశారు. తగిన విధంగా స్పందించేందుకు తమ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని అంటూ ‘ వారు మాటలు చెబుతూనే ఉంటారు…మేము చేతలలో చూపుతాం’ అని అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడిన అనంతరం అబ్బాస్ అరాగ్చీ తన సహచర ప్రతినిధులతో కలిసి బయటికి వెళ్లిపోయారు. ఇరాన్ ప్రతినిధుల చర్యకు షరీఫ్ నివ్వెరపోయారు. అయితే చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఏర్పాటు చేసిన పశ్చిమ దేశాల పాత్రికేయుల సమావేశానికి కూడా ఇరాన్ ప్రతినిధులు హాజరు కాలేదు. చర్చల ప్రారంభానికి ముందే ఉద్రిక్త వాతావరణం కన్పించిందని ఇరాన్ మీడియా తెలిపింది
గ్రూప్ ఫొటోకు ఇరాన్ నిరాకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



