ట్రంప్ వ్యాఖ్యలకు నెతన్యాహు కౌంటర్
జెరూసలేం : పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ తన ఆదేశాలను పాటిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రధానమంత్రి బెంజమన్ నెతన్యాహు ఖండించారు. తాము ఇద్దరం ఒకరి నుంచి మరొకరి ఆదేశాలను పాటిస్తామన్న ఆరోపణలను తప్పుపట్టారు. జెరూసలేం న్యూస్ సిండికేట్ నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ పాలసీ సమ్మిట్ 2026’లో ప్రసంగించిన నెతన్యాహు ఈ మేరకు వ్యాఖ్యానించారు. అప్పుడప్పుడు ఘర్షణలు తలెత్తినప్పటికీ, ఇరు దేశాధినేతలు తమ జాతీయ ఎజెండాలకు ప్రాధాన్యం ఇస్తారని నెతన్యాహు స్పష్టం చేశారు.
“అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేను కోరుకున్నవన్నీ చేయరు. అలాగే ఆయన కోరుకున్నవన్నీ నేను చేయను. మేము స్వతంత్ర దేశాల నాయకులం. కొన్నిసార్లు మా అభిప్రాయాలు కలవవు. మా మధ్య ఏకాభిప్రాయం లేదు. అయినా మేము మా ప్రయోజనాల కోసం నిలబడతాము. నేను ఇజ్రాయిల్ ప్రయోజనాలు, దాని భద్రత కోసం నిలబడతాను. మేము తరచుగా ఒకే అభిప్రాయంతో ఉంటాము. కానీ కొన్నిసార్లు ఉండలేము. అయినా కానీ మేము ఒకరి సార్వభౌమత్వాన్ని, నాయకత్వాన్ని, మా ప్రజల పట్ల నిబద్ధతను గౌరవించుకుంటాం.” అని నెతన్యాహు తెలిపారు.
మరోవైపు అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా ఇరాన్‌ను అణ్వాయుధం తయారు చేసుకోనివ్వనని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. తాను ఇజ్రాయిల్ ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వాయుధాన్ని పొందే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఈ అంశంలో ఎలాంటి దౌత్య పరిణామాలు చోటుచేసుకున్నా సరే, తన నిర్ణయం మారదని నెతన్యాహు చెప్పారు. ఇందుకోసం అవసరమైతే ఎలాంటి చర్యలనైనా కొనసాగిస్తామని అన్నారు.
నెతన్యాహుపై స్వదేశంలోనూ వ్యతిరేకత
ఇదిలా ఉండగా, ఇజ్రాయిల్లోని నెతన్యాహు ప్రభుత్వంపై స్వదేశంలో కూడా ఒత్తిడి పెరుగుతోంది. జెరూసలేంలోని హీబ్రూ విశ్వవిద్యాలయం, అగామ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చిన తాజా పోలింగ్ డేటా ప్రకారం, ఈ ఘర్షణ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం నుంచి ఇరాన్ మరింత బలమైన స్థితిలో బయటపడిందని ఇజ్రాయిల్ ప్రజల్లో అధిక శాతం మంది విశ్వసిస్తున్నారు.
అంతకుముందు శుక్రవారం ఆక్సియోస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌పై దాడులను ఆపేందుకు ఇజ్రాయిల్ సైనిక చర్యలను ప్రభావితం చేయగలరా ?అని ఇందులో ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ట్రంప్, “అవును, నేను చేయగలను. వారికి నాపై చాలా గౌరవం ఉంది. వారు నేను చెప్పినట్లే చేస్తారు” అని అన్నారు. ఇజ్రాయిల్ ప్రధానమంత్రితో తన సంబంధం బాగుందని తెలిపారు. ఇజ్రాయిల్ మనుగడకు అమెరికా విదేశాంగ విధాన నిర్ణయాలు చాలా అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ప్రాంతీయ ఘర్షణల నేపథ్యంలో అమెరికా జోక్యం లేకపోతే ఆ దేశం ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు. ‘ట్రంప్ లేకపోయి ఉంటే ఇజ్రాయిల్ నాశనమైపోయేది.
ఇరాన్‌తో ఒబామా చేసుకున్న అణు ఒప్పందాన్ని తాను రద్దు చేయకపోయి ఉంటే నేడు ఇజ్రాయిల్ ఉండేది కాదు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
పశ్చిమాసియాలో 3 నెలలకుపైగా సాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఈనెల 18న అమెరికా-ఇరాన్లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి.
14 అంశాల ఆధారంగా యుద్ధవిరమణకు అంగీకరించాయి. 60రోజుల్లో తుది ఒప్పందం చేసుకోవటానికి చర్చలు జరపాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ఈ క్రమంలోనే లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిన నేపథ్యంలో వాషింగ్టన్, జెరూసలేం మధ్య విభేదాలు చెలరేగి దౌత్యపరమైన ఘర్షణ తలెత్తింది.
ఈ ఒప్పందాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన ఇజ్రాయిల్ క్యాబినెట్ సభ్యులకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్‌కు ఉన్న ఏకైక శక్తివంతమైన మిత్రదేశాన్ని విమర్శించడం అవివేకమని వాన్స్ అభిప్రాయపడ్డారు.
‘మా మధ్య ఏకాభిప్రాయం లేదు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



