Saturday, February 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది 

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది 

- Advertisement -

కరస్పాండెంట్ రాజేందర్ రెడ్డి 
నవతెలంగాణ – మిడ్జిల్ 

ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చేది ఉపాధ్యాయులేనని ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, ఉపాధ్యాయులు నిత్య విద్యార్థి పాత్ర పోషిస్తారని చైతన్య భారతి హై స్కూల్  కరస్పాండెంట్ రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని చైతన్య భారతి  హైస్కూల్  పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థునీ, విద్యార్థులు ఉపాధ్యాయులే తోటి విద్యార్థులకు విద్యను బోధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి పౌరులని క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకుంటే భవిష్యత్తులో స్థిరపడతారని విద్యార్థులకు సూచించారు.

విద్య ఉంటేనే  పేదరికం కూడా నిర్మూలించవచ్చని విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. చదువు పేదరికానికి  అడ్డు రాదని విద్యార్థులలోని నైపుణ్యతను గుర్తించి ఉపాధ్యాయులు విద్యను చెప్పుతున్నారని తెలిపారు. విద్యతోపాటు క్రీడా పోటీలలో కూడా రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఈరోజు పాఠశాలలో ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించిన విధంగానే భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా కష్టంతో అనుకోకుండా ఇష్టపడి చదివితే  ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని సూచించారు.

జిల్లా కలెక్టర్ గా కళ్యాణ్ , జిల్లా విద్యాధికారిగా సిద్దు, ఎంఈఓ గా ప్రణయ్ కుమార్, కరస్పాండెంట్ గా శివ ప్రసాద్, ప్రిన్సిపాల్ గా హర్షవర్ధన్ రెడ్డి, ఇన్చార్జిగా సంజయ్ , 30 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా  విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైతన్య భారతి హై స్కూల్ ఇన్చార్జి ధనుంజయ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు మిథ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -