నవతెలంగాణ – తుంగతుర్తి
ఈనెల 25 నుండి మార్చి 16 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన, సెట్-ఎ ప్రశ్నాపత్రాలను కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లలోని స్ట్రాంగ్ రూముకు తరలించారు. ఈ పత్రాలను సిఎస్, డిఓ ల పర్యవేక్షణలో భద్రపరిచి, పరీక్ష సమయానికి అరగంట ముందు సీసీ కెమెరాల నిఘాలో ఓపెన్ చేసి పరీక్షా కేంద్రాలకు తరలించనున్నట్లు తెలిపారు.
తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల,తెలంగాణ గిరిజన బాలికల గురుకుల కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెండు సెంటర్లలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, ఒకేషనల్ గ్రూప్ తో కలిపి మొత్తం 970 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సిఎస్ మధుకర్, డివో ఉపేందర్, గిరిజన బాలికల గురుకుల కళాశాల సిఎస్ అరుణ, డిఓ నరేందర్, ఆయా కళాశాలల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.



