మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య, శ్రావ్య నిర్మించిన ఈ మూవీని మార్చి 13న విడుదల చేయబోతున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్ ‘తిప్పుకుంటన్నవ్’ పాటను రిలీజ్ చేశారు. శనివారం రిలీజ్ చేసిన ఈ పాట యూట్యూబ్‌లో ఇన్‌స్టంట్‌గా చార్ట్ బస్టర్ అయింది అని చిత్రయూనిట్ తెలిపింది.
ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీని పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్, ఎనర్జిటిక్, ఫీల్ గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ పాటను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘తిప్పుకుంటన్నవ్’ అంటూ సాగే ఈ పాటను రాము రాథోడ్, అదితి భవరాజు ఆలపించారు. విజయ్ బుల్గానిన్ ట్యూన్ ఎంతో శ్రావ్యంగా ఉంది. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. ఈ పాటలో శ్రీదేవీ, హర్ష్ రోషన్ జంట చూడముచ్చటగా ఉంది అని మేకర్స్ పేర్కొన్నారు.
‘సక్కగ.. తిప్పుకుంటున్నవ్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



