Friday, April 24, 2026
E-PAPER
Homeసినిమాఅందర్నీ మెప్పించే 'ఎవరే..' సాంగ్‌

అందర్నీ మెప్పించే ‘ఎవరే..’ సాంగ్‌

- Advertisement -

అనిశ్రీ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ మీద వెంకట కళ్యాణ్‌ మండవిల్లి సమ ర్పణలో శిరీష మండవిల్లి నిర్మా ణంలో ‘ఎవరే’ ప్రైవేట్‌ ఆల్బమ్‌ని ఆనంద్‌ తెరకెక్కించారు. ఈ ఆల్బమ్‌కి స్టోరీ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ బాధ్యతల్ని ఆనంద్‌ నిర్వర్తించారు.
ఎస్‌ ఎస్‌ వర్దన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ ఆల్బమ్‌లో వెచలపు కష్ణ, రిద్ది అనామిక చరణ్‌ నటించారు. ఈ పాటను మే ఒకటో తేదీన క్రేజీ ఎన్‌ క్యాచీ యూట్యూబ్‌ ఛానెల్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు.
ఈ క్రమంలో బుధవారం ఈ పాటకు సంబం ధించిన రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అర్జున్‌ అంబటి, సింగర్‌ సాకేత్‌, రాంబాబు గోసాల ముఖ్య అతిథిగా విచ్చేశారు.
హీరో అర్జున్‌ అంబటి మాట్లాడుతూ,”ఎవరే’ టీంకు ఆల్‌ ది బెస్ట్‌. నిర్మాత బాగుంటేనే మళ్లీ ఇంకో పాటను గాని, సినిమాను గానీ తీస్తారు. పవన్‌ కళ్యాణ్‌ పాట పాడుతూ ఉంటే నేను ఫెర్పామ్‌ చేశాను. వర్దన్‌ మ్యూజిక్‌ బాగుంది. కష్ణ, రిద్ధి జంట బాగుంది. పక్కింటి అబ్బాయిలా కష్ణ కనిపిస్తున్నారు. ఈ పాట మంచి హిట్‌ అవ్వాలి’ అని అన్నారు.
‘ఎస్‌ ఎస్‌ వర్దన్‌ పేరు బాగుంది. తమన్‌ రేంజ్‌లో ఎదగాలని కోరుకుంటున్నాను. పవన్‌ కళ్యాణ్‌, అనన్య చక్కగా పాడారు. పాటలో ఎనర్జీ, మెలోడీ రెండూ చక్కగా కుదిరాయి’ అని సింగర్‌ సాకేత్‌ చెప్పారు.
డైరెక్టర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ, ‘నిర్మాత కళ్యాణ్‌ , శిరీష చేసిన సపోర్ట్‌ని ఎప్పటికీ మర్చిపోలేను. నా గురువు లక్ష్మీ దేవీని కూడా ఈ ఈవెంట్‌కి ఆహ్వానిం చాను. నా ఈ జర్నీలో ఆమె సహ కారాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -