హాస్యనటుడు సత్య హీరోగా, దర్శకుడు రితేష్ రానాతో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్‌లీ’. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు.
మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
హీరో సత్య మాట్లాడుతూ,’రితేష్ కథ చెప్పగానే చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్ చాలా నచ్చి సినిమా చేశాను. ఇందులో క్యారెక్టర్ హీరోలా కాకుండా కామెడీ స్పేస్‌లోనే ఉంటుంది. యాక్షన్ కామికల్‌గానే ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌తో జరిగే ఇంటరాక్షన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి సెగ్మెంట్‌ని చాలా ఎంజారు చేశాను. రితేష్ స్టయిల్‌లో వర్క్ చేయడంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో చిరంజీవి రిఫరెన్స్‌లు ఉంటాయి’ అని అన్నారు.
‘ఇది యాక్టర్‌ని బట్టి డిజైన్ అయ్యే స్టోరీ. సత్య అనుకున్నప్పుడు తన స్టయిల్ క్యారెక్టరైజేషన్ బట్టి స్క్రిప్ట్‌ని డిజైన్ చేశాం. సత్య యాడ్ అవ్వడం వలన కామెడీ మరింత ఎలివేట్ అయ్యింది. సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. మిషన్ ఇంపాజిబుల్ సినిమా సత్యతో తీస్తే ఎలా వుంటుందో ఈ సినిమా అలా వుంటుంది. ఇందులో యాక్షన్, కామెడీ ట్విస్ట్‌లు అన్నీ ఉంటాయి. తెలుగులో ఈ సినిమా చాలా కొత్తగా వుంటుంది’ అని డైరెక్టర్ రితేష్ రానా చెప్పారు.
ప్రొడ్యూసర్ చెర్రీ మాట్లాడుతూ,’ఈ సినిమాను ఐదు నెలల ఐదు రోజుల్లో షూటింగ్, ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేశాం. నిర్మాతగా ఇంతకంటే కావాల్సింది ఏమీలేదు. డైరెక్టర్ రితేష్‌కి థ్యాంక్స్. ఈ సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. సత్య, వెన్నెల కిషోర్ చాలా బిజీగా ఉండే ఆర్టిస్టులు అయినప్పటికీ ఎంతో కోఆపరేట్ చేశారు. ఇప్పటివరకు తెలుగు ఇండిస్టీలో అలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. ఫ్లైట్‌లో జరిగే సంఘటనలు, కామెడీతో ఈ సినిమా ఎంజారు చేసేలా ఉంటుంది’ అని తెలిపారు.
ఆద్యంతం నవ్వించే ‘జెట్లీ’
- Advertisement -
- Advertisement -



