Wednesday, April 22, 2026
E-PAPER
Homeసినిమా'గేదెల రాజు' హిట్‌ ఖాయం

‘గేదెల రాజు’ హిట్‌ ఖాయం

- Advertisement -

రఘుకుంచే టైటిల్‌ పాత్ర పోషిస్తున్న చిత్రం ‘గేదెలరాజు’. కాకినాడ తాలుకా అనేది ట్యాగ్‌లైన్‌. మోటూరి టాకీస్‌ పతాకంపై రఘు కుంచె సమర్పణలో చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. వాణి రవికుమార్‌ మోటూరి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 24న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకులు వీవీ వినాయక్‌, వీఎన్‌ ఆదిత్య, నిర్మాత, రైటర్‌ కోన వెంకట్‌ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్‌ వినాయక్‌ మాట్లాడుతూ, ‘రఘు కుంచె ఇండిస్టీలో అందరికీ మిత్రుడు. ఎంతోమంది స్నేహితులను సంపాదించుకున్నాడు. ఆర్టిస్టుగా, హీరోగా ప్రయత్నించాడు. మ్యుజీషియన్‌గా, సింగర్‌గా పేరు తెచ్చుకున్నాడు. సోలో హీరోగా నటించాలనే ఆయన కల ఈ చిత్రంతో నెరవేరుతోంది. రిలీజ్‌కు మంచి డేట్‌ దొరికింది. సినిమా నచ్చి మైత్రీ లాంటి సంస్థ రిలీజ్‌ చేయడమే ఈ సినిమాకు మొదటి విజయం. రఘు కుంచె క్యారెక్టర్‌నే టైటిల్‌గా పెట్టి ఎంతో ప్యాషనేట్‌గా చేశారు. ఈ సినిమా విజయం సాధించి రఘుకు, అలాగే దర్శకుడు చైతన్యకు సక్సెస్‌ దక్కి, పెద్ద దర్శకుడు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు.
‘రఘు కుంచె తన కొడుకును త్వరలో హీరోను చేయబోతున్నాడు. ఈ లోగా తను హీరోగా సినిమా చేసేశాడు. ఈ సినిమా కంటెంట్‌ నేను చూశాను. చాలా బాగుంది’ అని రైటర్‌, ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌ చెప్పారు.
దర్శకుల సంఘం ప్రెసిడెంట్‌ వీఎన్‌ ఆదిత్య మాట్లాడుతూ,’ట్రైలర్‌ నాకు బాగా నచ్చింది. రఘు కుంచె మంచి నటుడు. నటుడిగా ఆయన పెద్ద కెరీర్‌ బిల్డ్‌ చేసుకోవచ్చు. ఈ చిత్ర నిర్మాత వాణి తన కొడుకు చైతన్యను డైరెక్టర్‌ను చేయడం గొప్ప విషయం. ఈ సినిమా పరీక్షలు పూర్తయి హాలీడేస్‌ వచ్చిన మంచి టైమ్‌లో రిలీజ్‌ అవుతోంది. మైత్రీ సంస్థ రిలీజ్‌ చేస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -