Sunday, February 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుథ్రిల్‌ చేసే 'కిల్లర్‌'

థ్రిల్‌ చేసే ‘కిల్లర్‌’

- Advertisement -

జ్యోతి పూర్వజ్‌, పూర్వాజ్‌, లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్‌’. ధ్యానం నాన్న ఆశీస్సులతో థింక్‌ సినిమా, ఏయూ అండ్‌ ఐ స్టూడియోస్‌ బ్యానర్స్‌ పై పూర్వాజ్‌, పద్మనాభ రెడ్డి.ఎ.నిర్మిస్తున్నారు. ఉర్వీశ్‌ పూర్వజ్‌ సమర్పకులు. పూర్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ సినిమా టీజర్‌ నేడు (ఆదివారం) రిలీజ్‌ కానుంది. అయితే, టీజర్‌ చూసి తనకు బాగా నచ్చడంతో శనివారమే డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి రిలీజ్‌ చేయటం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘టీజర్‌ చాలా బాగుంది. డిఫరెంట్‌ జోనర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సై ఫై థ్రిల్లర్‌ జోనర్స్‌ కలిపి ఈ సినిమాను బాగా రూపొందించారు.

కాంబినేషన్స్‌ అన్నీ వెరైటీగా ఉన్నాయి. బాగా ఎగ్జిక్యూట్‌ చేశారు. గ్రాండ్‌గా నిర్మించారు. జ్యోతిని ఎన్నో సీరియల్స్‌లో చూశాం. ఇప్పుడు ఈ మూవీలో ఆమె ట్రాన్సఫర్మేషన్‌ షాకింగ్‌గా ఉంది. యాక్షన్‌ బాగా చేశారు. రియల్‌ లైఫ్‌లో భార్య భర్తలు ఈ రీల్‌ లైఫ్‌లో ఎలా చేశారు అనేది ఆసక్తికరంగా ఉంది’ అని అన్నారు. ‘చిన్న సినిమాలను ఎంకరేజ్‌ చేయడంలో అనిల్‌ ముందుంటారు’ అని హీరోయిన్‌ జ్యోతి పూర్వజ్‌ చెప్పారు. డైరెక్టర్‌ పూర్వాజ్‌ మాట్లాడుతూ,’అనిల్‌ పాజిటివిటీ స్ప్రెడ్‌ చేయాలి. కొత్త వాళ్లకు మన వంతు ప్రోత్సాహం ఇవ్వాలి అంటూ టీజర్‌ రిలీజ్‌ చేశారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -