Wednesday, June 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏసీబీకి చిక్కిన మరో భారీ అవినీతి తిమింగలం

ఏసీబీకి చిక్కిన మరో భారీ అవినీతి తిమింగలం

- Advertisement -

నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్
సూపరింటెండెంట్ నివాసాల్లో సోదాలు
రూ.50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్
స్థిరాస్థి రూ.3 కోట్లు.. బహిరంగ మార్కెట్‌లో అంతకుమించి
మూడు లాకర్లు గుర్తింపు.. నేడే రేపో తెరిచే అవకాశం


నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి/కంఠేశ్వర్
అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులే టార్గెట్‌గా ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తుంది. దాంతో వారికి మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెం డెంట్ కొమ్మురి మల్లారెడ్డి నివాసాల్లో మంగళవారం సోదాలు జరిపింది. నిజామాబాద్, హైదరాబాద్‌తో పాటు వారి బంధువులు, బినామీలు కలిపి మొత్తం 10 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ నిజామాబాద్ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. సోదాల్లో మొత్తం 4 నివాసాలతో పాటు ఒక వాణిజ్య భవనం, 8 ఓపెన్ ప్లాట్‌లు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. వీటికి తోడు ఇంట్లో నగదు రూ.3.31 లక్షలు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.50 లక్షల ఉన్నట్టు గుర్తించారు. నిందితుడి భార్యతో పాటు కుటుంబీకుల పేర్ల మీద మూడు లాకర్లు ఉన్నాయని, విచారణలో భాగంగా వాటిని తెరవనున్నట్టు వెల్లడించారు. సోదాల సమయంలో గుర్తించిన ఆస్తుల విలువ రూ.3 కోట్లు ఉందని.. బహిరంగ మార్కెట్‌లో అనేక రేట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉందని, సుమారు రూ.100 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉన్నట్టు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని జ్యూడీషియల్ రిమాండ్ కోసం హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -