Wednesday, June 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి

మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి

- Advertisement -

చీఫ్‌ ‌విప్‌ పట్నం మహేందర్ రెడ్డి
మహిళా సంఘాల టీ స్టాల్స్‌ ప్రారంభం


​నవతెలంగాణ – మేడ్చల్ కలెక్టరేట్

​ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి.. కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలోని లక్ష్మీ గార్డెన్‌లో మంగళవారం ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల టీ స్టాల్స్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, సరూర్‌నగర్ ప్రాంతాలకు చెందిన 5,62,421 మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 26,601 స్వయం సహాయక సంఘాలకు చెందిన 2,66,010 మంది మహిళలకు గత ఏడాది రూ.576 కోట్ల బ్యాంక్‌ లింకేజ్ రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రూ.31.53 కోట్ల రుణాలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా (ఐఏఎస్), మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గం ఇన్‌‌చార్జి పరమేశ్వర్ రెడ్డి, అడిషనల్‌ కమిషనర్ రఘు ప్రసాద్, సర్కిల్ డీసీలు రవీందర్ సాగర్, నిత్యానంద్, మాజీ కార్పొరేటర్లు పావని మణిపాల్ రెడ్డి, సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి, స్వర్ణరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేశెట్టి (గడ్డం) ప్రసాద్, గడ్డం యాదగిరి, సింగిరెడ్డి వెంకటరెడ్డి, పోచయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -