నవతెలంగాణ – చిన్నగూడూరు : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకురావడం, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం లక్ష్యంగా వ్యవసాయ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో మంగళవారం విత్తన మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పంటల విత్తనాలు, సాగు విధానాలు, పంటల సంరక్షణకు సంబంధించిన వివరాలను రైతులకు అధికారులు వివరించారు
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ రైతులు ధృవీకరించబడిన విత్తనాలనే కొనుగోలు చేయాలని, నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పథకాలు, సబ్సిడీల గురించి కూడా రైతులకు అవగాహన కల్పించారు. ఈ మేళాకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరై విత్తనాలు, వ్యవసాయ సాంకేతికతలపై సమాచారాన్ని తెలుసుకుని సద్వినియోగం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈఓ శిరీష, కేసముద్రం మార్కెట్ కమిటీ డైరక్టర్ ఆవుల శ్రీనివాస్, రైతు జక్కుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా విత్తన మేళా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



