Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కోర్టు వాయిదాలకు హాజరుకాని వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఎస్ఐ 

కోర్టు వాయిదాలకు హాజరుకాని వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఎస్ఐ 

- Advertisement -

నవతెలంగాణ – చిన్నగూడూరు : మండలంలోని మంగొరిగూడెం గ్రామానికి చెందిన లునావత్ రమేష్ కోర్టులో కొనసాగుతున్న కేసుకు సంబంధించి పలుమార్లు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని ఎస్ఐ కుషకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం జారీ చేసిన వారెంట్‌ను అమలు చేసి సంబంధిత వ్యక్తిని కోర్టులో హాజరుపరచగా, తోరూర్ కోర్టు న్యాయమూర్తి ధీరజ్ కుమార్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ సబ్ జైల్ కు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కోర్టు ఆదేశాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, న్యాయ ప్రక్రియకు సహకరించాలని ఎస్ఐ సూచించారు. కోర్టు వాయిదాలకు హాజరుకాని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -