Wednesday, June 24, 2026
E-PAPER
Homeజిల్లాలుపెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -
  • తపస్  రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ ఉపాధ్యాయులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంతోపాటు రావాల్సిన డిఏలు చేయాలన్నారు. పిఆర్సి, రిపోర్ట్, ఈహెచ్ఎస్ కార్డులను  పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్  రద్దు చేసి, ఓపిఎస్ ను అమలు చేయాలన్నారు. ప్రమోషన్ తో కూడిన బదిలీలు చేపట్టాలని తపస్  రాష్ట్ర శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించని యెడల పెద్దఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పోరాటం తప్పదని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు సల్లూరి కిషన్ గౌడ్, డివిషన్ బాధ్యులు శంకర్ గౌడ్, వేణు, రవి, ప్రసాద్, స్వర్ణలత, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -