- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో గోడౌన్ కింద దాదాపు 50 మంది కార్మికులు ఉన్నారని సమాచారం. ప్రస్తుతం సంఘటన స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ముగ్గురు కార్మికులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20మందిని విపత్తు దళాలు రక్షించాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మిగతా 30 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలంలో సాయుధ దళాలు, పోలీసులు. అగ్నిమాపక శాఖ అన్నీ కలిసి పనిచేస్తున్నాయి.
- Advertisement -



