Friday, June 26, 2026
E-PAPER
Homeజాతీయంతెలంగాణ లోని 4, 931 కి.మీల నేషనల్ హైవేలపై ఆరా

తెలంగాణ లోని 4, 931 కి.మీల నేషనల్ హైవేలపై ఆరా

- Advertisement -

నాణ్యత, పురోగతి, నిర్వహణ పై కేంద్ర మంత్రి గడ్కరీ సమీక్ష
న్యూఢిల్లీ : తెలంగాణ లోని 4,931 కిలో మీటర్లల జాతీయ రహదారులపై నాణ్యత, పురోగతి, నిర్వహణ పై కేంద్ర రోడ్డు, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం నాడిక్కడ జరిగిన ఈ సమావేశంలో కేంద్ర రోడ్డు, హేవేల శాఖ సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, నేషనల్ హేవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ ఏఐ), ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్(2,035 కిలో మీటర్లు), లడక్ (804 కిలో మీటర్లు) నేషనల్ హైవే ప్రాజెక్ట్ లపై వేరు వేరుగా సమీక్షించారు. ప్రధానంగా మీడియాలో ప్రసారం అయిన కథనాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ఫిర్యాదులు, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ల సమాచారం, కేంద్ర మంత్రిత్వ శాఖ, ఎన్ హెచ్ఏఐ, ఇతర వర్గాల సమాచారంపై కీలకంగా చర్చించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ… పనుల్లో నాణ్యత, జవాబుదారీతనం, అత్యున్నత ప్రమాణాలను ఫాలో అవుతూ ప్రాజెక్ట్ లను వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. పర్యావేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని, నిర్ధిష్ట సమయంలోపు పనులు పూర్తి చేయాలని, హేవే కారిడార్ల స్థిరతవం, సౌకర్యవంతమైన ప్రయాణం, దీర్ఘకాలిక పనితీరును మెరుగుపరచడానికి అత్యున్నత పద్దతులను అనుసరించాలని ఆదేశించారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రాజెక్ట్ లలో తగిన సన్నాహక చర్యలను చేపట్టాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -