Thursday, June 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబాలయ్య 112వ సినిమా షురూ

బాలయ్య 112వ సినిమా షురూ

- Advertisement -

హీరో బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో ఎస్ ఎల్ వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో గురువారం ప్రారంభమైంది. ఏపీ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సురేష్ బాబు, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, సాహు గారపాటి తదితరులు పాల్గొని చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అంద జేశారు. కందుల దుర్గేష్ కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, నారా లోకేష్ క్లాప్ కొట్టారు. బాలకృష్ణ కుమార్తె నంద మూరి తేజస్విని మొదటి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఇది బాలకృష్ణ నటిస్తున్న 112వ సినిమా. ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ, ‘రచయితగా, దర్శకుడిగా మారకముందే బాలకృష్ణ నటించిన సినిమాలకు సహాయ రచయితగా, సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం నాకు లభించింది. నేను ఎప్పుడూ ఆయనకు వీరాభిమానిని. ఆయన కోసం ఒక కథను రాసి, దర్శకత్వం వహించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా బాలకృష్ణ అభిమానులకే కాకుండా, సినిమా ప్రేమికులందరికీ ఒక చిరస్మరణీయమైన అనుభూతిని మిగులుస్తుందని నాకు నమ్మకం ఉందిఅని అన్నారు. 'ఆంధ్రప్రదేశ్‌లో ఇంత భారీ స్థాయిలో ఒక సినిమా ప్రారంభోత్సవం జరిగి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది అని బాలకృష్ణ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -