సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ జీఎంబి ఎంటర్‌టైన్ మెంట్’ బ్యానర్‌పై, ఏ ప్లస్ ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్ మెంట్స్‌తో కలిసి సమర్పిస్తున్నారు. వెంకటేష్ మహా రచన, ఎడిటింగ్, దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 3న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన మహేష్ బాబు మెస్మరైజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా తన అభిప్రా యాలను పంచుకుంటూ, ‘రావు బహదూర్… ఇది కేవలం ప్రేక్ష కులను కట్టిపడేసే సినిమా మాత్రమే కాదు, వారి మనసులో లోతుగా ముద్ర వేసుకునే చిత్రం. విభిన్నంగా, అందంగా, ఇంటెన్స్ డ్రామాతో కూడిన సినిమా ఇది. దర్శకుడు వెంకటేష్ మహా ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ప్రపం చాన్ని సత్యదేవ్ తనదైన శైలిలో అద్భుతంగా ఆవిష్కరించారు. దీపా థామస్ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. మొత్తం టీం పట్ల ఎంతో గర్వంగా ఉంది. జూలై 3 నుండి బిగ్ స్క్రీన్ పై’రావు బహ దూర్’ మ్యాడ్ నెస్ ను మీరందరూ ఎక్స్ పీరియన్స్ చేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను` అని అన్నారు.
మనసులపై ముద్ర వేసే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



