కేఎం (కృష్ణమోహన్), పూజా సుందర్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్స్ లైఫ్ బ్రో’. కేఎం ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై సోమశేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ మోహన్ సల్లగుండ్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో నితిన్ విడుదల చేశారు. దర్శకుడు సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ,’వైవిధ్యమైన కథ, కథనాలతో ఎమోషనల్ లవ్‌స్టోరీగా రూపొందు తున్న ఈ చిత్రం అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భావోద్వేగ ప్రేమకథ అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, అంబటి శ్రీనివాస్, దేవి ప్రసాద్, కిరీటి, త్రిశూల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: ఇ.రాజయ్య. డీఓపీ: చైతన్య, సంగీతం: సాహిత్య సాగర్, ఎడిటర్: సత్య గిద్దుటూరి.
భావోద్వేగభరిత ప్రేమకథ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



