దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన ఈ చిత్రం జూలై 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర టీజర్, పాటల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ,’ముత్యాల సుబ్బయ్య చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది. ఈ కథ నచ్చి మా అమ్మాయి దివిజను సినిమా చేయమని ప్రోత్సహించాను. నిర్మాత కోమలి ఎంతో కష్టపడ్డారు. దర్శకుడు సతీష్ అద్భుతంగా తెరకెక్కించారు. నాన్న గొప్పతనం, తల్లిదండ్రుల విలువను ఎంతో హృద్యంగా చూపించారు. ఈ సినిమాలోని పాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయిఅని అన్నారు. 'కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కో వాలో ఈ సినిమా చూపిస్తుంది అని దర్శకుడు సతీష్ ఆవాల చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ,”హనుమాన్స్థాయి విజయం మా సినిమా అందుకుంటుంది. ఈ మిమ్మల్ని కంటతడి పెట్టిస్తుందిఅని తెలిపారు.
తల్లిదండ్రుల విలువ తెలిపేలా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



