Thursday, June 25, 2026
E-PAPER
Homeజాతీయంఅయోధ్యలో కేటుగాళ్లు!

అయోధ్యలో కేటుగాళ్లు!

- Advertisement -

ఆడిట్‌ ‌సంస్థ ముందే చెప్పింది
2020లోనే అవకతవకల గురించి హెచ్చరికలు
రూ. 3,500 కోట్ల నగదు విరాళాలకు సరైన రికార్డులే లేవు
పలు నిర్వహణా లోపాలు గుర్తింపు.. సూచనలూ జారీ
అయినా పట్టించుకోని శ్రీరామ జన్మభూమి తీర్థక్ష‍ేత్ర ట్రస్టు
ఫలితం.. నేడు నగదు, నగల దుర్వినియోగ కలకలం
భక్తులలో అనేక అనుమానాలు, ఆందోళనలు
యోగి సర్కారు తీరుపై అనేక సందేహాలు

న్యూఢిల్లీ : ‌యూపీలోని అయోధ్య శ్రీరామ మందిరాన్ని నిర్వహిస్తున్న రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవహారాల్లో ప్రస్తుతం వెలుగుచూస్తున్న విరాళాల దుర్వినియోగ ఆరోపణలు కొత్తవి కావనీ, ఈ ముప్పును 2020లోనే ఒక ప్రయివేటు ఆడిట్ సంస్థ ముందుగానే హెచ్చరించినట్టు వెల్లడైంది. ట్రస్టు ఏర్పడిన కొద్ది నెలలకే నిర్వహించిన ఈ ఆడిట్‌లో.. విరాళాల నిర్వహణకు సరైన విధానాలు, ఆర్థిక లావాదేవీలకు వ్యవస్థీకృత రికార్డులు లేవనీ, బాధ్యతల పంపిణీ స్పష్టంగా నిర్వచించలేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే దేవాలయానికి సమర్పించిన నగదు, బంగారు నగలు, ఇతర విలువైన వస్తువుల లెక్కల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరుపుతోన్న విషయం విదితమే. మంగళవారం ఆ బృందం తన ప్రాథమిక నివేదికను యూపీ ప్రభుత్వానికి అందించింది.

​ఆడిట్ ఏం చెప్పింది?7

ఈ ఆడిట్‌‌ సంస్థ తన నివేదికను 2020 నవంబరులో సమర్పించింది. ఈ నివేదిక ట్రస్టు నిర్వహణ అనేది వృత్తిపరమైన ప్రమాణాలకు దూరంగా ఉందని పేర్కొంది. ముఖ్యంగా, ప్రతి ఆర్థిక లావాదేవీకి, డేటా నిర్వహణకు, సిబ్బంది బాధ్యతలకు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) రూపొందించాలని సూచించింది. అలాగే విరాళాల స్వీకరణ, లెక్కలు, నిల్వ, నివేదికల తయారీలో ఏకరీతి విధానం లేదని గుర్తించింది. ఆర్థిక నివేదికల కోసం అవసరమైన వ్యవస్థీకృత రికార్డులు అందుబాటులో లేవని పేర్కొంది. లావాదేవీలను ధృవీకరించే రెండో, మూడో స్థాయి తనిఖీ వ్యవస్థ లేదని హెచ్చరించింది. బాధ్యతలను స్పష్టంగా నిర్వచించే సంస్థాగత నిర్మాణం (ఆర్గనైజేషనల్‌ ‌స్ట్రక్చ ర్‌) లేదని ఆడిట్‌ ‌నివేదిక విమర్శించింది.

​రూ.3500 కోట్ల నగదు విరాళాలు
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 2020 ఫిబ్రవరి 5న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాటైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు భక్తుల నుంచి సుమారు రూ.3,500 కోట్ల నగదు విరాళాలు అందినట్టు అంచనా. వీటితో పాటు బంగారం, వెండి నగలు, ఇతర విలువైన కానుకలు కూడా పెద్ద మొత్తంలో సమర్పించబడ్డాయి. ఇంత భారీ స్థాయిలో విరాళాలు వచ్చినప్పటికీ.. వాటి నిర్వహణకు సంబంధించిన ప్రామాణిక విధానాలను అమలు చేయలేదని ఆడిట్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

​‘ఆడిట్‌ ‌సూచనలు పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు’
ఆడిట్‌ ‌నివేదిక సూచనలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆడిట్ నివేదికలో సూచించిన మార్పులను అప్పుడే అమలు చేసి ఉంటే ప్రస్తుత వివాదాలు, అనుమానాలు, విచారణలు ఎదురయ్యేవి కావని ట్రస్టుతో అనుబంధం ఉన్న ఓ వర్గం చెప్తోంది. ‘‘నేడు ఎదురవుతున్న గందరగోళం చాలావరకు నివారించ గలిగేదే. ఆడిట్ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుని ఉంటే ఈ స్థాయికి విషయం వచ్చేది కాదు’’ అని వారు అంటున్నారు.
​మానవ వనరుల నిర్వహణలోనూ లోపాలు
వేలాది మంది సిబ్బందితో పనిచేస్తున్న సంస్థకు ప్రత్యేక మానవ వనరుల (హెచ్‌ఆర్‌) విభాగం లేదని ఆడిట్‌ ‌సంస్థ గుర్తించింది. బ్యాంకు ఖాతాల సమన్వ యం కోసం అర్హత కలిగిన సిబ్బంది లేరని పేర్కొంది. అకౌంటింగ్ డేటా నమోదు, నిర్వహణ కోసం తగిన నిపుణులు లేరని ఆడిట్‌ ‌సంస్థ వివరిం చింది. దీంతో ఆర్థిక సమాచారంలో పొరపాట్లు, అస్పష్టత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించడం గమనార్హం.
​డేటా భద్రతపై కూడా తీవ్ర ఆందోళన
ఆడిట్ నివేదికలో అత్యంత కీలకంగా ప్రస్తావిం చిన అంశం డిజిటల్ డేటా భద్రత. ట్రస్టు డేటాను నిర్వహిస్తున్న ఐటీ సంస్థపై సరైన పర్యవేక్షణ లేదని, సున్నితమైన సమాచారం ఎలా భద్రపరుస్తున్నారో రికార్డులు లేవని గుర్తించింది. సర్వర్ భద్రత, డేటా దొంగతనం ముప్పుపై స్పష్టమైన విధానాలు కనిపిం చలేదని పేర్కొంది.ఇలాంటి పరిస్థితుల్లో సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని ఆడిట్‌ ‌సంస్థ హెచ్చరించింది. అలాగే తప్పుదారి పట్టించే నివేదిక లు తయారయ్యే అవకాశం ఉంటుందనీ, అనధికార లావాదేవీలు జరిగే ముప్పు పెరుగుతుందని కూడా పేర్కొంది.

​ట్రస్టు నుంచి లేని స్పందన
ఈ అంశాలపై స్పందన కోసం ట్రస్టు అకౌం టెంట్‌, ప్రధాన కార్యదర్శి చంపత్‌ ‌రాయ్‌‌ నుంచి ఎలాంటి సమాధానమూ రాకపోవడం గమ నార్హం. అలాగే ట్రస్టు అధికారిక వెబ్‌సైట్‌లో ఎస్‌ఓపీ అమలు వివరాలు గానీ, అంతర్గత ఆడిట్ నివేదికలు గానీ అందుబాటులో లేకపోవడం అనేక అనుమానా లకు తావిస్తోంది. కాబట్టి రామమందిర ట్రస్టులో ప్రస్తుతం వినిపిస్తున్న విరాళాల దుర్విని యోగ ఆరోపణలు అకస్మాత్తుగా ఏర్పడినవి కావనీ, 2020లోనే ఆడిట్ సంస్థ పరిపాలనా, ఆర్థిక, డేటా నిర్వహణ లోపాలను గుర్తించి హెచ్చరించిందనీ, అయితే ఆ సూచనలను పూర్తిగా అమలు చేయకపోవడంతో, నేడు వేల కోట్ల రూపాయల విరాళాల నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
​‘ఎఫ్‌ఐఆర్‌ ‌లేదు.. దోషులు తప్పించుకోవచ్చు’
భక్తులు సమర్పించిన విరాళాలు, కానుకలు దొంగిలించబడ్డాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో ఎంత మొత్తం నష్టం జరిగిందన్నది స్పష్టంగా లేదు. కొందరు వందల కోట్లనీ, మరి కొందరు వేల కోట్లని అంటున్నారు. అయితే నిజం తేలాలంటే లోతైన, పారదర్శక దర్యాప్తు అవసరమని అంతా భావిస్తు న్నారు. సాధారణంగా ఇది ఎఫ్‌ఐఆర్‌ ‌ద్వారా ప్రారం భం కావాలనీ, కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ ‌కూడా నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని అంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల ఈ కేసుతో సంబంధమున్న దోషులు తప్పించుకునే అవకాశాలున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యోగి ప్రభుత్వం ఈ విషయంలో దోషులను తప్పించే చర్యలకు ప్రయత్ని స్తున్నదనే అనుమానాలూ వారిలో కలుగుతున్నాయి. సిట్‌ ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించి నప్పటికీ.. దాని వివరాలు బహిర్గతం కాలేదు.
​నగల లెక్కలపైనా ఆందోళన
ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఆరోపణల్లో నగదు మాత్రమే కాకుండా, భక్తులు సమర్పించిన బంగారు నగలు, విలువైన వస్తువుల లెక్కల్లోనూ గందరగోళం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై 2020లోనే ఆడిట్ సంస్థ హెచ్చరించింది. నగలు, ఇతర వస్తువుల రూపంలో వచ్చే విరాళాలకు ప్రత్యేక స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలనీ, ప్రతి వస్తువు కూడా నమోదయ్యే (రిజిస్టర్‌) విధంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ, వస్తువుల నిల్వ, భద్రత, లెక్కలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -