Thursday, June 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్మూజ్‌లో ఎలాంటి సుంకాల్లేవ్‌

హార్మూజ్‌లో ఎలాంటి సుంకాల్లేవ్‌

- Advertisement -

ఇరాన్ కు నేరుగా నిధులు ఇవ్వం : ట్రంప్
న్యూయార్క్ : హార్ముజ్‌ జల సంధిలో నౌకల రాకపోకలపై అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. జల సంధి మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఎటువంటి సుంకాలు, బీమా ఖర్చులు లేదా ఇతర ఏవిధమైన రుసుములూ వసూలు చేయమని ఇరాన్‌ హామీ ఇచ్చిందన్నారు. ఒకవేళ ఇది తప్పుడు సమాచారమైతే, వారితో చర్చలను వెంటనే నిలిపివేస్తా మన్నారు. ఇక ఇరాన్‌కు నేరుగా ఎటువంటి నిధులు విడుదల చేయడం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. మొక్కజొన్న, గోధుమ, సోయాబీన్‌ తదితర ఆహార పదార్థాలను కొను గోలు చేసేందుకు వారికి (ఇరాన్‌కు) సంబంధించిన నిధుల్లోంచి కొంత మొత్తాన్ని అమెరికా రైతులు, పశు పోషకులకు విడుదల చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఇరాన్‌కు ఆహార పదార్థాలు అత్యవసరమని, వాటిని ప్రత్యేకంగా అమెరికా నుంచే కొనుగోలు చేసి సరఫరా చేస్తామ న్నారు. హార్ము జ్‌లో ఇటీవల ట్రాఫిక్‌ పెరిగిందని, రికార్డు స్థాయిలో చమురు రవాణా జరుగుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెబుతున్నారు. వీటికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఓ అమెరికా వార్తా సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం.. జూన్‌ 12-14 తేదీల్లో 32 నౌకలు హార్ము జ్‌ను దాటగా.. 19-21 తేదీల్లో 93 నౌకలు సురక్షితంగా జలసంధిని దాటినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -